Showing posts with label Flix NEWS. Show all posts
Showing posts with label Flix NEWS. Show all posts







 

Viral Video: అరె ఇదేంటి..? తీరానికి కొట్టుకొచ్చిన వింత జీవి..


సముద్రతీరానికి వింత జంతువు కొట్టుకొచ్చింది అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆ జీవి రూపం మాత్రం విచిత్రంగా ఉంది. ముఖం ఆవును పోలి ఉంది. కొమ్ములు కూడా ఉన్నాయి. అయితే మిగిలిన శరీరం అంతా డాల్ఫిన్‌లా ఉంది.




నెట్టింట రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఎడిటెడ్ వీడియోస్ కూడా ఉంటున్నాయి. దీంతో నిజం ఏదో ఫేక్ ఏదో తెలుసుకోవడం కష్టతరంగా మారింది ఈ మధ్య డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో.. కొంచెం కూడా అనుమానం రాకుండా ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నారు నెటజన్లు. తాజాగా సముద్రం తీరానికి ఓ వింత జంతువు కొట్టుకొచ్చింది అన్న వీడియో తెగ వైరల్ అవుతోంది.. అందులో ఓ పెద్ద చేప చూడటానికి డాల్ఫిన్ ఆకారంలో ఉంది. అయితే ముఖం మాత్రం ఆవును పోలి ఉంది. దాని చుట్టూ జనాలు కూడా నిలబడి ఉండటం మీరు చూడవచ్చు. కొంతమంది ఇలాంటి వింత జంతువును తామెప్పుడూ చూడలేదని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఇది పక్కాగా ఫేక్ వీడియో అనేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోపై మీ ఒపినీయన్ ఏంటి…?


 

కోళ్లను మింగిన కొండచిలువ.. రెండేళ్ల తర్వాత రైతుకు పరిహారం ఇచ్చిన ప్రభుత్వం..


తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు తగిన నష్టపరిహారం మంజూరైంది.



ఇంటికి సమీపంలోనే చిన్న కోళ్ల ఫామ్‌ నడుపుకుంటున్న రైతు వద్ద కోళ్లు కనిపించకుండా పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అతనికి నష్టపరిహారం అందిచాల్సి వచ్చింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన కెవి జార్జ్ అనే పౌల్ట్రీ రైతు.. గత కొద్ది రోజులుగా తన ఫామ్‌లో వరుసగా కోళ్ల సంఖ్య తగ్గిపోతూ రావటంతో ఆందోళనకు గురయ్యాడు. కోళ్లను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారని మొదట్లో అనుమానించాడు. కానీ, 2022 జూన్‌లో ఓ రోజు ఆ కోళ్ల దొంగను గుర్తించాడు. అది ఎవరో తెలిసి నివ్వెరపోయాడు.. కోళ్లను ఎత్తుకెళ్తున్న దొంగ కొండచిలువ అని తెలిసి భయబ్రాంతులకు గురయ్యాడు. వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.



సమాచారం మేరకు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని బంధించి తీసుకెళ్లారు. ఆ తరువాత ఇలాంటి అరుదైన సరీసృపాలు రాష్ట్ర రక్షణలో ఉన్నందున.. దీనిని పట్టించి ఇచ్చినందుకు గానూ.. పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ అధికారులు జార్జ్‌కు చెప్పారు. వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం ఇలాంటి కొండచిలువకు అత్యంత రక్షిత హోదా కల్పించబడింది. కాగా, పరిహారం కోసం జార్జ్‌ ప్రయత్నం మాత్రం ఫలించలేదు. పరిహారం కోసం అతడు నెలల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాడు.

ఎట్టకేలకు స్థానిక మంత్రి ఒకరు నిర్వహించిన జనతా అదాలత్‌లో దిక్కుతోచని స్థితిలో ఉన్న జార్జ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తనకు జరిగిన అన్యాయంపై మంత్రి గారి ఎదుట ఎకరువు పెట్టుకున్నాడు. పాము కేరళ ప్రభుత్వానికి చెందినదని, అయితే తాను కోల్పోయిన కోళ్లు తనవేనని చెప్పుకున్నాడు. తనకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వంపై జార్జ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంత్రి జార్జ్‌ను శాంతింపజేసినప్పటికీ అతనికి పరిహారం అందలేదు. చివరకు కేరళ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, అతను కమిషన్‌ను ఆశ్రయించేలోపుగానే.. అతనికి పరిహారం గురించి అటవీ శాఖ నుండి కాల్ వచ్చింది. రాష్ట్రప్రభుత్వం కొండచిలువ తినేసిన కోళ్లకు రూ.2,000 నష్టపరిహారం మంజూరైంది.

సంతోషంగా ఉన్న జార్జ్ చివరకు ఉపశమనం పొందాడు. అతని ప్రయత్నాలకు ప్రతిఫలం లభించిందని చెప్పాడు. ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తున్న పాముల నుండి తన కోళ్లఫామ్‌ను రక్షించుకోవడానికి గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాడు.

 

Watch: టాయిలెట్‌కి వెళ్దామని డోర్ తీయగా.. వామ్మో.. ఒక్కసారిగా మనిషి ఎత్తున

ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.




వానాకాలం మొదలైంది. వర్షాలు, వరదల కారణంగా పాములు, తేళ్లు, ఇతర క్రిమికీటకాలు నీళ్లలో కొట్టుకు వస్తుంటాయి. వెచ్చటి ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. అలా ఇంట్లో దూరిన పాములు తరచూ వంటింట్లో, కోళ్ల గూళ్లు, వాష్‌రూమ్‌లో నక్కి ఉంటుంటాయి. నివాస ప్రాంతాల్లో పాములు కనిపించడం కొత్త కాదు. పాములు ఇంట్లో పార్క్ చేసిన స్కూటర్, బూట్లలో కూడా కూర్చుంటాయి. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇంట్లోకి పాములు రావడం గురించి తరచూగా వింటూనే ఉంటాం. అలాంటి ఘటనే ఇది కూడా. టాయిలెట్‌లో దూరిన పాము బేసిన్‌లో తల పైకెత్తి కూర్చొని ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం ఒక క్షణం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. వామ్మో ఇదేందీరా సామీ అని అందరూ భయపడిపోయేలా చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.




అశోక్ కుమార్ (ashokshera94) అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోని షేర్‌ చేశాడు. ఈ సీన్ చూస్తే.. చిన్నప్పుడు టాయిలెట్‌కి వెళితే పాము ఎట్నుంచి వస్తుందోననే భయపడేవాళ్లం.. ఇప్పుడు ఆ భయం నిజమైంది. వైరల్ వీడియోలో ఒక పెద్ద పాము టాయిలెట్ బేసిన్‌లో తల పైకెత్తి కూర్చున్న భయానక దృశ్యం కనిపించింది. ఇక నుంచి టాయిలెట్‌కి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.




 

Video: వామ్మో.. డేగ కన్నా పవర్ ఫుల్‌గా ఉన్నావ్‌గా భయ్యా.. క్యాచ్ చూస్తే, కళ్లు బైర్లు కమ్మాల్సిందే..


Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది.





Harry Brook Viral Catch: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (ENG vs WI) ప్రారంభమైంది. లార్డ్స్‌లోని చారిత్రక క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలని ఇంగ్లాండ్ జట్టు నిర్ణయించింది. మ్యాచ్ తొలిరోజు టీ సమయానికి ఇంగ్లండ్ జట్టు 1 వికెట్ కోల్పోయి 30 పరుగులు చేసింది. అయితే, అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్ పట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.





హ్యారీ బ్రూక్ అద్భుత క్యాచ్..

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌ అద్భుత క్యాచ్‌ అందుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22వ ఓవర్‌లో ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ స్వయంగా చేశాడు. కరీబియన్ బ్యాట్స్‌మెన్ లూయిస్ ఓవర్ రెండో బంతికి డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, అతను బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు. బంతి అతని బ్యాట్ బయటి అంచుని తీసుకొని రెండవ స్లిప్ వైపు గాలిలోకి వెళ్లడం ప్రారంభించింది.


బంతి సెకండ్ స్లిప్‌లోకి రావడం చూసి, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హ్యారీ బ్రూక్ అద్భుతంగా డైవ్ చేసి మైదానాన్నా తాకబోతున్న సమయంలో ఒంటి చేత్తో పట్టుకున్నాడు. హ్యారీ బ్రూక్ పట్టిన ఈ క్యాచ్‌ని చూసి బెన్ స్టోక్స్, బ్యాట్స్‌మెన్, స్టేడియంలో ఉన్న అభిమానులు అందరూ ఆశ్చర్యపోయారు. హ్యారీ బ్రూక్ ఈ క్యాచ్ వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక X ఖాతా నుంచి షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Money-Doubling Scam: డబుల్ ధమాకా డబ్బుల స్కీం.. ఆశ చూపి రూ. 40 కోట్లతో జనానికి కుచ్చుటోపీ..!


అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.





అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.


నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘరానా మోసగాడు డబుల్ ధమాకా డబ్బుల స్కీంతో ఏకంగా రూ40 కోట్లు కొల్లగొట్టాడు. చింతపల్లి మండలం మాల్ (గోడుకొండ్ల )వద్ద మదిని సంజయ్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు. వంద పెట్టుబడితో రూ. 2వందలు, వెయ్యి పెడితే రూ. 2 వేలు, పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు, రూ. లక్షతో రెండు లక్షల రూపాయలు అంటూ డబుల్ ధమాకా ఆశ చూపించాడు.

మొదట్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇచ్చి నమ్మించాడు. ఏకంగా గ్రామానికి చెందిన 10మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు రూ.16 వేల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకున్నాడు. చింతపల్లి మండలంతోపాటు మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైద్రాబాద్ వరకు విస్తరించాడు. దీంతో మనీష్ రెడ్డి మనీ ట్రాప్ లోకి సామాన్యులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరిపోయారు.

ఆశ అన్ని మరిచేలా చేస్తుంది. వేలు లక్షలు పెట్టుబడి పెట్టారు. అందరికీ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. వందలాది మంది నుండి సుమారు రూ.40 కోట్లు కొల్లగొట్టాడు. కొంతకాలం కొందరికి ఇంటికి, వాహనాలకు లోన్లు ఇస్తానని నమ్మించాడు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీసిన మనీష్ రెడ్డి 7 నెలలుగా వడ్డీ చెల్లించకుండా బోర్డు తిప్పేశాడు. మనీష్ రెడ్డి బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, లెక్చరర్లు, స్టూడెంట్స్ ఉన్నారు.

గ్రామానికి దూరంగా ఉంటూ బాధితులనుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు మనీష్ రెడ్డి. చాలామంది బాధితులు అత్యాశతో బంధువుల నుంచి అప్పుగా తీసుకొచ్చి లక్షల రూపాయలు మనీష్ రెడ్డి చేతులో పోశారు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ మనిష్ రెడ్డి పై బాధితులు ఒత్తిడి పెంచారు. రెట్టింపు డబ్బులు దేవుడెరుగు తాము పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు కోరుతున్నారు. పిల్లలు అవసరాల కోసం డబ్బులు వస్తాయని అత్యాశతో ఏజెంట్లతో మనిష్ రెడ్డి వద్ద పెట్టుబడి పెట్టామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతున్నారు.

మాల్ గ్రామానికి మనీష్ రెడ్డి వచ్చాడని తెలుసుకున్న బాధితులు తమ పెట్టుబడి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు అసలైనా ఇవ్వమని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర రూపాయి కూడా లేదు జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అంటూ మొండికేశాడు. దీంతో తానే పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కాడు మనిష్ రెడ్డి. గ్రామస్తుల వేధింపులు భరించలేక పోతున్నానంటూ పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మనీష్ రెడ్డి స్వయంగా పోలీసులను ఆశ్రయించాడు. స్టాక్ మార్కెట్ పేరుతో మునిశ్ రెడ్డి మోసం చేశాడంటూ చాలామంది బాధితులు తమను ఆశ్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు..

ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే కొందరు రూ. లక్ష నుండి రూ. 10లక్షలు పెట్టుబడి పెడితే, ఒక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సహా ఓ బ్యాంక్ క్యాషియర్ రూ. 60లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. డబుల్ ధమాకా పేరుతో సామాన్యులను మోసం చేసిన మనిశ్ రెడ్డి.. https://99.com లో బెట్టింగ్ పెట్టి ఐదు కోట్ల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఈ కేటుగాడు ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో తేలనుంది. ఈజీ మనీ కోసం అత్యాశ పడకూడదని, ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. బి కేర్ ఫుల్.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఛానల్ ఫాలో అవ్వండి.